Local news

జగన్మోహన్ రెడ్డి భుజానికి మూడు కుట్లు

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో దాడికి గురైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికు హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఎడమ భుజానికి వైద్యులు కుట్లు వేశారు. 24 గంటలపాటు విశ్రాంతి తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డికి వైద్యులు సూచించారు.

జగన్మోహన్ రెడ్డి వెంట ఆయన సతీమణి భారతి, బంధువులు ఉన్నారు. హాస్పిటల్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి పార్టీ కార్యకర్తలు, నేతలు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉన్న ఆయన నివాసానికి, చికిత్స జరుగుతున్న హాస్పిటల్ కు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని పరామర్శించేందుకు వివిధ పార్టీల నాయకులు కూడా వస్తున్నారు.

Comment here