ఐదురూపాలు దొంగతనం.. ఐదేళ్ళు జైలు శిక్ష..

ఒక్కొక్కసారి ఊహించింది ఒకటి.. జరిగేది ఒకటి అవుతుంది… కొన్ని కొన్ని సినిమాల్లో దొంగతనం సీన్స్ చూపిస్తూ.. రూ.500 పోగొట్టుకుని.. 50 రూపాయలు సంపాదించి కడుపారా నవ్విస్తారు. ఇక తాజాగా కాస్త అటు ఇటుగా జరిగి.. ఐదు రూపాయలు దొంగతనం చేసి… ఐదేళ్ళు జైలు శిక్ష అనుభవించబోతున్న దొంగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!
ఢిల్లీకి చెందిన 43 ఏళ్ల ఓ వ్యాపారి బట్టల తయారీ కి ఉపయోగపడే ముడిసరుకు తయారు చేసి.. మళ్ళీ దాన్ని అమ్ముతుంటాడు.. అయితే ఆ వ్యాపారి.. ఖలీద్ అనే వ్యక్తీ వద్ద ముడిసరుకు కొంటాడు.. ఖలీద్ ఆ వ్యాపారిని డబ్బులు పెట్టుకు ప్రయాణించే బ్యాగ్ ను బాగా గమనించాడు.. దీంతో ఆ బ్యాగ్ కొట్టేయాలనే ఆలోచన వచ్చింది.. వెంటనే తన నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి ప్లాన్ చేశాడు. ఒకరోజు వ్యాపారి తన స్కూటర్ పై వెళ్తున్న సమయంలో ఖలీద్ అతని గ్యాంగ్ ముసుగు ధరించి వ్యాపారిని అడ్డుకుని… గన్ తో బెదిరించి కళ్ళలో కారం కొట్టి… బ్యాగ్ ను స్కూటర్ ను తీసుకుని పారిపోయారు.. అనంతరం ఖలీద్ ఆ బ్యాగ్ ను ఓపెన్ చేసి చూడగా… అందులో ఉన్న డబ్బులు చూసి షాక్ తిన్నాడు.. ఖలీద్ ఎన్నో లక్షలు ఉంటాయని ఆశపడి దొంగతనం చేస్తే… తీరా ఆ బ్యాగ్ లో ఉన్నది ఐదు రూపాయలు… ఈ దొంగతనం పై వ్యాపారి… పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు దొంగల ముఠాను అరెస్ట్ చేసి కోర్టు లో హాజరు పరిచారు.. నేరం రుజువు కావడం ఖలీద్ అండ్ కొ కు ఐదేళ్ళు జైలు శిక్ష పడింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here