Cinema

అనంతపురం స్టేట్ బ్యాంక్ శాఖలో 43 లక్షల చోరీ

అనంతపురం జేఎన్టియు స్టేట్ బ్యాంక్ శాఖలో శుక్రవారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు.బ్యాంక్ వెనుకవైపునున్న కిటికీ ఊచలలను గ్యాస్ కట్టర్ తో కట్ చేసి లోపలికి ప్రవేశించి మందుగా అలారం స్విచ్ ను ఆఫ్ చేసి గ్యాస్ కట్టర్, స్టీమర్లను లను లోపలికి తీసుకెళ్లి స్ట్రాంగ్ రూమ్ గోడను పగలగొట్టి లోపలికెళ్లి లాకర్లను కట్ చేసి దోపిడీకి పాల్పడ్డారు. సీసీ కెమెరాల్లో ఇద్దరు ముసుగు వ్యక్తులు పాల్గొన్నట్లు నమోదయ్యింది. 42 లక్షలు దోపిడీకి గురైందని చెబుతున్నారు. ఉదయం 10గంటలకు బ్యాంక్ కు వచ్చిన సిబ్బంది దీనిని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతపురం డిఎస్పి వెంకట్రావు ఆధ్వర్యంలో పోలీసులు, క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. భద్రత సరిగా లేనందునే ఈ సంఘటన జరిగినట్లు భావిస్తున్నారు.ఇది తెల్లవారు జామున 2 నుంచి 5 గంటలవరకూ జరిగి ఉండవచ్చంటున్నారు…..KS

Comment here