National

చంద్రబాబు రీకాల్ పిటీషన్ కు న్యాయస్థానం అనుమతి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బాబ్లీ కేసులో ధర్మాబాద్ కోర్టు మినహాయింపు ఇచ్చింది. బాబ్లీపై పోరాటం కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను రద్దు చేయాలంటూ న్యాయవాదులు వేసిన రీకాల్ పిటీషన్ పై ధర్మాబాద్ కోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. చంద్రబాబు నాయుడు తరుపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూత్రా, సుబ్బారావు వాదనలు వినిపించారు. తమ క్లయింట్ ముఖ్యమంత్రి కావడంతో వ్యకిగత హాజరు సాధ్యం కాదని, ఈ కేసు వ్యవహారమై మీడియాలో వివరాలు వచ్చాకే నాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్లు తెలిసింది. రాజకీయ ప్రతీకారంతో కేసులో నన్ను ఇరికించారు. దీనికి సంబంధించి సమన్లు,నోటీసు, బెయిలబుల్ వారెంట్ నాకు అందలేదు. ఎఫ్ఐఆర్ నమోదయ్యాక కూడా కనీసం మొదటి నోటీసు అందలేదు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు తీవ్రమైనవేమీ కావు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉపసంహరించడానికి ఇది తగిన కేసు. ఈ వాదనలకు బలం చేకూర్చే విధంగా పలు సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకిస్తూ, వారెంట్ రీకాల్ సమయంలో నిందితుడు న్యాయస్థానంలో హాజరు కావాల్సిన అవసరంలేదు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని జులై 5వ తారీఖు 2018న జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ను రీకాల్ చేయండి. అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిటీషన్ లో కోరారు. దీనని పరిశీలించి, చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు విన్నాక న్యాయమూర్తి రీకాల్ పిటీషన్ను అనుమతించారు.

Comment here