మహాకూటమిలో మొదటిదశ చర్చలు పూర్తి

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో తెరాస ఓటమే లక్ష్యంగా ఏర్పాటైన మహాకూటమిలో గత కొద్దిరోజులుగా నలుగుతున్న సీట్ల సర్దుబాటు వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మహాకూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయా పార్టీల నేతలు సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చించారు. మొదటిదశ చర్చలు పూర్తయ్యాయి. కూటమిలో కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. పొత్తుల ప్రతిపాదనలను తెలంగాణ తెలుగుదేశం పార్టీ, సీపీఐ, తెలంగాణ జన సమితి పార్టీలు కాంగ్రెస్ పార్టీకి అందజేశాయి. సర్వేల ఆధారంగా పార్టీల బలాబలాలు అంచనా వేయాలని చర్చల్లో భాగంగానే నిర్ణయం తీసుకున్నారు. పార్టీల పరిస్థితిపై సర్వే చేసే భాద్యతను కూటమిలో పార్టీలు కాంగ్రెస్ పార్టీకి అప్పగించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల్లో ఫ్లాష్ సర్వే చేపట్టింది. రెండు రోజుల్లో సర్వే ఫలితాలు వెల్లడవుతాయని సమాచారం. అనంతరం సీట్ల సర్దుబాటుపై రెండో విడత చర్చించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here