ఆగస్టు 9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక : వెంకయ్యనాయుడు

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఆగస్టు 9న ఎన్నికలు జరుగుతాయని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సోమవారం ప్రకటించారు. ఆగష్టు 8వ తేదీ నామినేషన్లకు చివరి రోజని తెలిపారు. ఇప్పటి వరకూ డిప్యూటీ చైర్మన్ గా ఉన్న కురియన్ పదవీకాలం జూన్ తో ముగిసింది. కురియన్ కేరళ నుంచి కాంగ్రెస్ టికెట్ పై రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీజేపీకి రాజ్యసభలో తగినంత బలం లేకపోవడంతో ప్రాంతీయ పార్టీల మద్దతుతో తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి తమ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here