Local news

రీకాల్ పిటీషన్ ధర్మాబాద్ కోర్టు తిరస్కరణ

బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన కేసుపై ధర్మాబాద్ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. రీకాల్ పిటీషన్ తిరస్కరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ చట్టానికి ఎవరూ మినహాయింపు కాదని, ముఖ్యమంత్రైనా, ఎవరైనా కోర్టు ఆదేశాలు పాటించాల్సిందేనని, ఎవరికీ స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వదలచుకోలేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో కోర్టుకు హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది కోరారు. అక్టోబర్ 15న కోర్టులో హాజరుకావాలని జడ్జి ఆదేశిస్తూ కేసును అక్టోబర్ 15కు వాయిదా వేశారు. కాగా కేసులో ఉన్న తెలంగాణ నాయకులు గంగుల కమలాకర్, ప్రకాష్ గౌడ్, ఎంఎస్ రత్నం సోమవారం కోర్టుకు హాజరయ్యారు. వారికి న్యాయవాది బెయిల్ మంజూరు చేశారు.

Comment here