టవర్ ఆకృతిలో అసెంబ్లీ నిర్మాణం

ఐదు అంతస్తుల్లో అసెంబ్లీ నిర్మాణం ఉంటుందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నూతన అసెంబ్లీ కోసం టవర్ ఆకృతిలో ఉన్న డిజైన్ ను నార్మర్ పోస్టర్ సంస్థ రూపొందించింది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. శుక్రవారం కోడెల శివప్రసాదరావు నార్మన్ పోస్టర్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతిలో శాశ్వత అసెంబ్లీ భవనాల డిజైన్లపై తుది రూపు తీసుకొచ్చేందుకు కసరత్తు చేశారు. చివరకు టవర్ ఆకృతిలో ఉన్న అసెంబ్లీ డిజైన్ ను సిఎం ఫైనల్ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల మాట్లాడుతూ శాశ్వత చట్టసభల డిజైన్లపై నార్మన్ పోస్టర్ ప్రతినిధులతో చర్చించినట్లు కోడెల తెలిపారు.ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సిబ్బందికి కావాల్సిన వసతులపై కూడా చర్చించినట్లు తెలిపారు. పూర్తిస్థాయి డిజైన్లపై పలు మార్పులు సూచించినట్లు వెల్లడించారు. అందం, ఆకర్షణలే కాకుండా సెక్యూరిటీ పరంగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. సెల్లార్ లో సర్వీసులు, ఫస్ట్ ఫ్లోర్ లో అసెంబ్లీ, కౌన్సిల్ హాల్ ఉంటాయన్నారు. రెండో అంతస్తులో మంత్రుల లాంజ్ లు, మూడో ఫ్లోర్ లో ప్రభుత్వ కార్యకలాపాల కోసం నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు.అసెంబ్లీ జరగని సమయంలో పర్యాటకులను అనుమతిస్తామని స్పష్టం చేశారు. టవర్ 250 మీటర్ల ఎత్తులో వస్తుందన్నారు.లిఫ్టుల ద్వారా టవర్ పైకి వెళ్లి నగర్ అందాలు వీక్షించే అవకాశం ఉంటుందన్నారు………KS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here