Local news

టెర్రస్ గార్డెనింగ్ పై హైదరాబాద్ లో జాతీయ సదస్సు

సేంద్రీయ పద్దతిలో టెర్రస్ గార్డెనింగ్ పై జనవరి మొదటివారంలో హైదరాబాద్ లో 2 రోజుల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు శనివారం మీడియాకు తెలిపారు. తెలంగాణా ప్రభుత్వ ఉద్యానవన శాఖ సహకారంతో ఈ డదస్సు జరుగుతుందన్నారు. హైదరాబాద్ ను గ్రీన్ సిటీగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా హైదరాబాద్ లో ఈ జాతీయ సదస్సును ఏర్పాటు చేయాలని రైతునేస్తం ఫౌండేషన్ సంకల్పించిందని పేర్కొన్నారు. ఈ సదస్సులో దేశంలో ఉన్న టెర్రస్ గార్డెనింగ్ నిపుణులు, శాస్త్రవేత్తలు పాల్గొని గార్డెన్ పెంపకం, వర్టీకల్ గార్డెనింగ్, హైడ్రోపోనిక్స్ సాగు, పురుగులు, తెగుళ్ల నివారణ పద్ధతులు, టెర్రస్ గార్డెనింగ్ లో వాడే పనిముట్లు, యంత్రపరికరాల వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. పూర్తి వివరాలకోసం 9490559999, 9849312629 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు…….KS

Comment here