Local news

తెలంగాణా బీసీ రుణాల విధివిధానాలు ఖరారు

వెనుకబడిన తరగతులకు పూర్తి రాయితీతో ఆర్థిక తోడ్పాటు పధకాల విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. బీసీ సంక్షేమశాఖ దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీచేసింది. యూనిట్ ధర 50 వేల రూ. వరకూ ఉంటే వంద శాతం రాయితీ, యూనిట్ ధర లక్ష రూ. ఉంటే ఎనబై శాతం రాయితీ, యూనిట్ ధర రెండు లక్షల రూ. వరకూ ఉంటే డెబ్భై శాతం రాయితీ, యూనిట్ ధర ఐదు లక్షల రూ. వరకూ ఉంటే అరవై శాతం రాయితీ ఉంటుందని పేర్కొన్నారు. మిగతా మొత్తం బ్యాంకు రుణం లేదా లబ్ధిదారు వాటాగా ఉంటుందని తెలిపారు. బీసీ ఆర్థిక సంస్థ, పదకొండు బీసీ సమాఖ్యల ద్వారా పధకాలు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపికకు కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఉంటుందని చెప్పారు…..KS

Comment here