కేంద్రం తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తోన్న రామ్మోహన్‌ నాయుడు..

పార్లమెంట్ లోపల బయట ఎక్కడ వీలు దొరికితే అక్కడ టిడిపి ఎంపీలు ఆంధ్ర ప్రదేశ జరుగుతున్న అన్యాయం పై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇక లోక్‌సభలో జీరో అవర్‌లో.. విశాఖ రైల్వే జోన్‌ అంశాన్ని ఎంపీ అవంతి శ్రీనివాస్‌ లేవనెత్తారు. కేంద్రం విభజన హామీలు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రైల్వే జోన్‌ ఇస్తామని ప్రకటించారని.. కానీ రెండు రోజుల తరువాత సుప్రీం కోర్టులో ధాఖలు చేసిన అఫిడవిట్‌లో.. రైల్వే జోన్‌ ఇవ్వడం లేదని కేంద్రం ఎందుకు చెప్పిందని అవంతి నిలదీశారు..
ఇదే విషయం పై పార్లమెంట్‌ బయట ఎంపీ రామ్మోహన్‌ నాయుడుస్పందిస్తూ… కేంద్రం తీరును తప్పు పట్టారు. రైల్వే జోన్‌ అంశాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వలో ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు అంతా కలిసి వెళ్లి.. కేంద్రమంత్రిని కలిసే ప్రయత్నం చేస్తామన్నారు రామ్మోహన్‌ నాయుడు..

లోక్‌సభలో సమయం దొరికినప్పుడు రాష్ట్ర సమస్యలను లేవనెత్తుతున్న టీడీపీ ఎంపీలు.. సభ బయట ఆందోళనలు రోజూ కొనసాగిస్తున్నారు. ప్లకార్డులు పట్టుకుని వియ్‌ వాంట్‌ జస్టిస్‌ అని నినాదాలు చేస్తున్నారు.. పార్లమెంట్‌ ప్రారంభానికి ముందు టీడీపీ ఎంపీలంతా గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేపట్టారు. ఎపీకి న్యాయం చేయాలి అని నినాదాలు చేశారు. మరోవైపు రోజుకో వేషధారణతో నిరసన తెలుపుతున్న ఎంపీ శివప్రసాద్‌ ప్రజా కవి వేషధారణలో పార్లమెంట్‌కు వచ్చారు.. మరో ఎంపీ మురళీ మోహన్‌తో కలసి.. కేంద్రం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీ ప్రజలు బీజేపీకి సరైన బుద్ధి చెప్పే సమయం ఆసన్నం అయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here