నేడు సుత్తివేలు జయంతి… నివాళితో…

సుత్తి కొట్టకండి మహాప్రభో..అనే డైలాగ్‌తో తెలుగు ప్రేక్షకులను మనసారా నవ్వించిన సుత్తివేలు జయంతి నేడు.. ఈ సందర్భంగా ఆయన సిని ప్రస్థానాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం.. సుత్తివేలు గా పేరు గాంచిన ప్రముఖ హాస్య నటుడు అసలు పేరు.. కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. ఈ యన సుమారుగా సుమారు 200 చిత్రాలలో నటించాడు. అలాగే కొన్ని టివి సీరియల్స్ లో కూడా నటించి మెప్పించారు. మనిషి నూతిలో పడితే అనే నాటకంలో ఆయన పాత్రను చూసిన హాస్యబ్రహ్మ జంధ్యాల తన చిత్రం ముద్ద మందారంలో సుత్తివేలు కు రిసెప్షనిష్టుగా చిన్న పాత్రను ఇచ్చారు. ముద్దమందారం సినిమాతో సుత్తివేలు 1981 లో వెండి తెరపై అడుగు పెట్టారు. అనంతరం జంధ్యాల తన వరుస చిత్రాలైన మల్లె పందిరి, నాలుగు స్తంభాలాట లలో కూడా సుత్తివేలుకు అవకాశాలనిచ్చాడు. ఇదే సమయంలో సుత్తివేలు ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అనంతరం నటననే తన వృత్తిగా స్వీకరించాడు. ఆనంద భైరవి, రెండుజెళ్ళ సీత, శ్రీవారికి ప్రేమలేఖ, చంటబ్బాయి వంటి పలు విజయవంతమైన చిత్రాలలో హాస్యపాత్రలను పోషించాడు. త్రిశూలం చిత్రం తర్వాత అవకాశాలు సన్నగిల్లడంతో కొద్దిరోజులు కష్టాలను అనుభవిందాడు. తర్వాత టి. కృష్ణ వరుసగా ఐదు చిత్రాలలో అవకాశాలిచ్చాడు. అప్పటి వరకు హాస్య పాత్రలనే పోషిస్తూ వచ్చిన సుత్తివేలుకు, ఈ చిత్రాలలో తన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు.. వందేమాతరం, ప్రతిఘటన, కలికాలం, ఒసేయ్ రాములమ్మ చిత్రాలలో ఆయన పోషించిన పాత్రలు మరపురానివి. వందేమాతరం చిత్రానికి గాను 1984లో ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు. అప్పట్లో సిని పరిశ్రమ మద్రాసులో ఉండడంతో అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు. చిత్రపరిశ్రమ హైదరాబాదుకు తరలడంతో తగినన్ని అవకాశాలు మళ్ళీ సన్నగిల్లాయి.. అదే సమయంలో టివి లో సీరియల్స్ హవా మొదలైంది. దీంతో పలు సీరియల్స్ లో నటించే అవకాశం దక్కించుకున్నాడు. ఆనందోబ్రహ్మ, మల్లాది రామకృష్ణశాస్త్రి కథలు, భమిడిపాడి రామగోపాల్ కథలు ఈయనకు మంచిపేరు తీసుకువచ్చాయి. చివరి రోజులలో తన మకాంను హైదరాబాదుకు మార్చాడు. ఈ హాస్య బ్రహ్మ చేతిలో రూపుదిద్దుకున్న హాస్య వేలు … సుత్తి వేలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here