దళితులపై దౌర్జన్యాలకు సంబంధించి ఇంతకముందు ఉన్న చట్ట నిబంధనలను పునరుద్ధరించేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. అంతకుముందున్న నిబంధనలను చట్టంలోకి తీసుకురావాలన్న దళిత సంఘాల కీలక డిమాండ్ కు కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. చట్టంలో అంతకుముందున్న నిబంధనలు తొలగించడంపై ఆగస్టు 9న భారత్ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి విదితమే. ఈక్రమంలో ఎస్సీ, ఎస్టీ చట్టంలో నిబంధనలను పునరిద్దరిస్తూ పార్లమెంట్లో చట్టం తీసుకురానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
దళిత సంఘాల డిమాండ్ కు తలొగ్గిన కేంద్రం

Related tags :
Comment here