విద్యార్థులతో గవర్నర్ ముఖాముఖి

మంగళవారం ఉదయం గవర్నర్ నరసింహన్ అబిడ్స్ లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. తాను కూడా ఐదవ తరగతి వరకు ఇదే స్కూల్లో చదువుకున్నానని గుర్తు చేశారు. ఇదే పాఠశాలలో చదువుకుని.., ఇప్పుడు గవర్నర్ హోదాలో ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. చదువు చెప్పే గురువులను, కని పెంచిన తల్లిదండ్రులను ప్రతిఒక్కరూ గౌరవించాలని గవర్నర్ నరసింహన్ విద్యార్థులకు సూచించారు. తన జీవితంలోని అనుభవాలను తాను చదువుకున్న స్కూల్ విద్యార్థులతో పంచుకోవడం చాలా తృప్తినిచ్చిందన్నారు. జీవితంలో డబ్బు ముఖ్యం కాదని, చదువే ముఖ్యమని గుర్తుంచుకోవాలన్నారు. విద్యార్థులందరూ ఆదిశగా ముందుకు సాగాలని గవర్నర్ నరసింహన్ సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here