CinemaMovies Reviews

రివ్యూ: శ్రీనివాసకళ్యాణం… జీవితంలో ఒక్కసారే జరుపుకొనే పండగ పెళ్లి

రివ్యూ : శ్రీనివాస కల్యాణం
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

నటీనటులు: నితిన్, రాశి ఖన్నా, ప్రకాష్ రాజ్, నందితా శ్వేత, జయసుధ, ఆమని, సితార, సీనియర్ నరేష్, పూనం కౌర్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు
సంగీతం : మిక్కి జే మేయర్
కెమెరా సమీరా రెడ్డి
నిర్మాతలు : దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్
కథ, దర్శకత్వం : సతీష్ వేగేశ్న

పెళ్లి… ఇద్దరు వ్యక్తులను.. ఆ వ్యక్తుల ద్వారా కలిసే రెండు కుటుంబాలను కలిపే వారధి.. మనసంప్రదాయంలో పెళ్ళికి చాలా ప్రాముఖ్యం ఉంది.. ఇంటి ముంగిట పందిళ్ళు, ముగ్గులు, నుదుట బాసికాలు, కళ్యాణ తిలకం, నవకాయ పిండివంటలు, సన్నాయి మేళాలు, జీలకర్ర బెల్లం, మూడు ముళ్ళు, ఏడడుగులు, అరుంధతి నక్షత్రం, చుట్టాల సందడి.. ఇవ్వన్ని కలిస్తే పెళ్లి.. ఓ సినీ గేయకారుడు అన్నట్లు పెళ్ళంటే.. తప్పెట్లు తాళాలు, తలంబ్రాలు, మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిపి నూరేళ్ళు… ఈ పాటనే కథాంశంగా తీసుకుని అందమైన సినిమాగా మలిచి నేటి తరం మరచిపోతున్న పెళ్లి సంప్రదాయాన్ని ప్రేక్షకుల ముందు శ్రీనివాస కళ్యాణం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.. సతీష్ వేగేశ్న… శతమానం భవతి సినిమాతో అవార్డులతో పాటు రివార్డులందుకున్న దిల్ రాజు, సతీష్ కాంబో మళ్ళీ వెండి తెరపై తమ మ్యాజిక్ ను చూపించిందా..? ఫస్ట్ లుక్, ట్రైలర్ టాక్ తో హిట్ గ్యారెంటి అనే ధీమాలో ఉన్న దిల్ రాజు ధీమా ఫలించిందా..? పెళ్ళంటే పెళ్ళిలా జరగాలి… ఫంక్షన్ లా కాదు అని చెబుతున్న ఈ శ్రీనివాస కళ్యాణం ప్రేక్షకులను ఆకట్టుకుండా చూద్దాం..!

కథ:
శ్రీనివాస్ (నితిన్) సఖినేటి పల్లి కి చెందిన యువకుడు.. ఆర్కిటెక్చరు.. వృత్తి రీత్యా చంఢీఘర్ లో ఉంటాడు.. అక్కడే కాఫీ డే లో పనిచేస్తున్న సిరి (రాశి ఖన్నా) తో శ్రీనివాస్ కు పరిచయం ఏర్పడుతుంది. పరిచయం ప్రేమగా మారి.. పెళ్లి చేసుకోవాలని భావిస్తారు.. కానీ తమ పెళ్ళికి పెద్దల అంగీకారం కావాలని.. శ్రీనివాస్ సిరి తండ్రి ఆర్ కె (ప్రకాష్ రాజ్) ను కలుస్తాడు.. అయితే ఆర్ కె హైదరాబాదు లో పెద్ద వ్యాపార వేత్త… క్షణాన్ని కూడా డబ్బుతో లెక్కించే బిజినేట్ మెన్.. తనకూతురు సిరి మాటకు విలువ ఇచ్చి పెళ్ళికి అంగీకరిస్తాడు. అయితే తన పెళ్లి నానమ్మ కోరిక నేరవేర్చేలా సంప్రదాయం ప్రకారం జరగాలని చెబుతాడు.. శ్రీనివాస్ కండిషన్ కు అంగీకరించిన ఆర్ కె ఒకవేళ ఎప్పుడైనా తన కూతురు విడిపోవాలని భావించి విడాకులు అడిగితె వెంటనే విడాకులు ఇవ్వాలని ముందుగానే అగ్రిమెంట్ రాయించుకుంటాడు. అయితే ఆర్ కె చెప్పిన అగ్రిమెంట్ పై శ్రీనివాస్ ఒక కండిషన్ పెట్టి.. సంతకం పెడతాడు.. మరి శ్రీనివాస్ ఆర్కే కు పెట్టిన కండిషన్ ఏమిటి? వీరి అగ్రిమెంట్ అందరికీ తెలుస్తుందా శ్రీనివాస్ సిరి కుటుంబ సభ్యులమధ్య సంప్రదాయ పెళ్లి ఎటువంటి ఇబ్బందులు తెచ్చింది.. అనుబంధం ఇచ్చింది అనేది తెరమీద చూడాల్సిందే…!!

విశ్లేషణ: మన సంప్రదాయం, సంస్కృతిని కాపాడుకుని రేపటి తరానికి అందించాల్సిన బాధ్యత అందరికీ ఉంది.. ఇక పెళ్ళంటే ప్రస్తుతం .. డబ్బుండి చేసుకొనే ఒక పెద్ద ఫంక్షన్.. ఇక పెళ్లి చోటు చేసుకొనే క్రతువు.. దానికి అర్ధం నేటి తరానికి చాలా వరకూ తెలియదు.. అటువంటి సంప్రదాయం నేటి తరాన్ని అందిచే లా పెళ్లి అనే అంశం చుట్టూ దర్శకుడు సతీష్ వేగేశ్న అల్లు కున్న కథ ‘శ్రీనివాస్ కళ్యాణం’ ఇప్పటికే తమ భవిష్యత్ అంటూ తల్లిదండ్రులకు దూరంగా ఉండే పిల్లల కోసం ఆ తల్లిదండ్రులు పడే ఆవేదనను చూపిస్తూ.. శతమానం భవతి సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న… రాసుకున్న మరో కుటుంబ కథ ఇది. ఇందులో పెళ్లి… పెళ్లి కి అర్ధం… కూతురికి పెళ్లి చేస్తూ.. తల్లిదండ్రులు చేసే పనులకు అర్ధం… జీవితంలో ఒకేసారి వచ్చే పండగ పెళ్లి… ఇటువంటి పండగ కోసం వధూవరుల కుటుంబంలో చోటు చేసుకునే బంధాలు అనుబంధాలను చక్కగా వివరించే ప్రయత్నం ఈ సినిమాతో చేశాడు.. నితిన్ రాశి ఖన్నాల జంట చూడచక్కగా ఉన్నది. ఒక ప్రకాష్ రాజ్ తన పాత్రలో ఎప్పటిలా జీవించాడు.. ముఖ్యంగా క్లైమాక్స్ లో నితిన్, ప్రకాష్ రాజ్ ల మధ్య నడిచే సీన్స్ ఆకట్టుకుంటుంది.
బొమ్మరిల్లు సీన్ ను గుర్తు తెస్తుంది. ఇక నందితా శ్వేతా, జ‌య‌సుధ‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సీనియ‌ర్ న‌రేశ్‌, ప్ర‌భాస్ శ్రీను, సితార‌, ఆమ‌ని ఇలా అంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. సంగీతం బాగుంది.. సమీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఎప్పటిలా శ్రీవెంకటేశ్వర బ్యానర్ లో వచ్చే సినిమా నిర్మాణ విలువ‌లు ఈ సినిమాలో దర్శనమిస్తాయి.. పాత్ర‌ల మ‌ధ్య వ‌చ్చే కీల‌క సిచ్యువేష‌న్స్‌లోని డైలాగ్స్ ఆక‌ట్టుకుంటాయి.. అయితే పెళ్లి గురించి వివరించాలని అనే ఆలోచనతో.. సాగదీత ఎక్కువుగా ఉన్నది.. దీంతో యూత్ ను ఆకర్షిస్తుందో లేదో చూడాలి..

చివరిగా…. పెళ్లి అంటే పంక్షన్ కాదు.. జీవితంలో ఒక్కసారే వచ్చే పండగ…

Comment here