Sports

ఫ్రీ క్వార్టర్స్ లోకి ప్రవేశించిన శ్రీకాంత్

చైనాలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో తెలుగువాడు కిదాంబి శ్రీకాంత్ ప్రీ క్వార్టర్స్ లోకి
ప్రవేశించాడు.పురుషుల సింగిల్స్ లో భాగంగా బుధవారం రెండో రౌండ్లో శ్రీకాంత్ స్పెయిన్ కు చెందిన పాబ్లో అబియాన్ తో తలపడ్డాడు. తొలి గేమును 21-15తో సునాయాసంగా గెలిచిన శ్రీకాంత్, రెండోరౌండ్ లో తడబడి గేమ్ ను 12-21తో చేజార్చుకున్నాడు. అనంతరం నిర్ణయాత్మక మూడో గేమ్ లో దూకుడుగా ఆడి పాబ్లోని ఒత్తిడికి గురిచేసి వరుస పాయింట్లు గెలిచి 21-14తో మూడో సెట్లో గెలిచి మ్యాచ్ ని గెలుచుకుని ఫ్రీ క్వార్టర్స్ లోకి ప్రవేశించాడు.

Comment here