గ్రహణ సమయంలో అభిషేకాలు అందుకొనే ఏకైన ఆలయం..

గ్రహణం ఏర్పడుతున్నదంటే… తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రాలు నుంచి.. చిన్న చిన్న దేవాలయాలను కూడా మూసివేస్తారు. కానీ శ్రీ కాళహస్తీశ్వర ఆలయం మాత్రం అందుకు అతీతం. దక్షిణ కైలాసంగా , వాయులింగేశ్వర క్షేత్రంగా పిలవబడుతూ… భక్తులతో పూజలందుకుంటున్న శ్రీకాళ హస్తీశ్వరుడు మాత్రం గ్రహణ కాల సమయంలో పూజలు… అభిషేకాలు అందుకుంటాడు. గ్రహణం ఏ సమయంలో వచ్చినా.. ఆ సమయంలో ఇక్కడి ఆలయాన్ని తెరచి ఆలయంలో కొలువుదీరిన శ్రీజ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరునికి గ్రహణ కాల అభిషేకాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.
శుక్రవారం నాటి సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని అర్ధరాత్రి 1 గంటకు (శనివారం వేకువజామున) సంకల్ప పూజలు ప్రారంభించి ఉదయం 3 గంటల్లోపు అభిషేకాలు పూర్తి చేయనున్నారు. ఈ సమయంలో దర్శనార్థం వచ్చే భక్తులను ఆలయంలోనికి అనుమతించనున్నారు.. శుక్రవారం నాటి సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ముక్కంటికి గ్రహణ కాల అభిషేకాలు నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లను అధికారులు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here