మొదటి వన్డేలో సౌతాఫ్రికా విజయం

David Miller of South Africa (R) walks from the field after being bowled out as Sri Lanka's Dinesh Chandimal (centre L) and Nuwan Kulasekara (C) celebrate during the Cricket World Cup one-day warm up match between South Africa and Sri Lanka at Hagley Park Oval in Christchurch on February 9, 2015. AFP PHOTO / MARTY MELVILLE (Photo credit should read Marty Melville/AFP/Getty Images)

ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా రాంగిరి అంతర్జాతీయ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మొదటి వన్డేలో సౌతాఫ్రికా అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 34.3 ఓవర్ల లొనే 193 పరుగులకి ఆలౌట్ అయ్యింది. శ్రీలంక బాట్సమెన్లలో కుషాల్ పెరీరా 81, తిషారా పెరీరా 49 మినహా మిగిలిన వారందరూ స్వల్ప స్కోర్ కే పరిమితమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడ 4 వికెట్లు, తాభ్రైజ్ షాంషి 4 వికెట్లు, లుంగి ఎంగిడి 1వికెట్ తీశారు. అనంతరం 194 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.31 పరుగులవద్ద వరుసనే రెండు వికెట్లు కోల్పోయింది. హాషిం ఆమ్లా 19, ఎయిడెన్ మార్క్ రం 0 పరుగులతో అవుటయ్యారు. మరో ఓపెనర్ డీకాక్ 47 తో జతకలసిన కెప్టెన్ డూప్లెసిస్ 47 కాసేపు నిలకడగా ఆడారు. వీరిద్దరూ కలిసి మూడోవికెట్ కు 86 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే 21వ ఓవర్లో ధనుంజయ వీరి భాగస్వామ్యాన్ని విడదీసాడు. తర్వాత కొంతసేపటికే డూప్లెసిస్ కూడా ఔటై వెను తిరిగాడు. ఈ దశలో జేపీ డుమినీ జట్టుకు అండగా నిలిచి సౌతాఫ్రికా ను గెలిపించాడు. 32 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్ లతో 53 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు.సౌతాఫ్రికా 31 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులుచేసి మ్యాచ్ ని కైవసం చేసుకుంది. అద్భుత బౌలింగ్ చేసిన సౌతాఫ్రికా బౌలర్ తబ్రైజ్ షాంషికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయం తో సిరీస్ లో సౌతాఫ్రికా 1-0 తో ఉంది……KS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here