సోషల్ మీడియాపై నియంత్రణ అవసరం : జయప్రకాశ్

సోషల్ మీడియాపై ప్రస్తుత రోజుల్లో నియంత్రణ అవసరమని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విద్వేషపూరిత వదంతులు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగం ఐసీఎస్ఎస్ఆర్ – ఎస్ఆర్ సీ సంయుక్త ఆధ్వర్యంలో పేస్ బుక్, స్వానిటి సహకారంతో వాయిస్ పాజిటివ్ అనే పేరుతో రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహించారు. సోషల్ మీడియాలో పాజిటివ్ గొంతులను పెంచేందుకు నిర్వహించిన ఈ వర్క్ షాప్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జయప్రకాశ్ నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాదనలతో గెలిచేందుకు కాకుండా ఎదుటివారిని ఒప్పించేందుకు ప్రయత్నించాలని విద్యార్థులకు సూచించారు. ఇలాంటి వర్క్ షాపులు ఏర్పాటు చేసినందుకు జర్నలిజం విభాగం, ఫేస్ బుక్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో విభాగం హెడ్ ప్రొఫెసర్ స్టీవెన్ సన్, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు…. KS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here