Local news

తెలంగాణ అడ్వకేట్ జనరల్ గా శివానందప్రసాద్ నియామకం

తెలంగాణ రాష్ట్ర నూతన అడ్వకేట్ జనరల్ గా బండ శివానందప్రసాద్ నియామకం అయ్యారు. జనగామ కు చెందిన హైకోర్టు సీనియర్ న్యాయవాది బండ శివానందప్రసాద్ ను నియామకం చేస్తూ తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఏజీ నియామక పత్రంపై కేసీఆర్ శుక్రవారం సంతకం చేశారు. ఇంతకుముందున్న ఏజీ ప్రకాష్ రెడ్డి వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది మార్చి 26న రాజీనామా చేసిన విషయం విదితమే. ప్రకాష్ రెడ్డి రాజీనామాను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. ఇప్పుడు శివానందప్రసాద్ ను కొత్త ఏజీగా నియమిస్తూ నియామక ఉత్తర్వులిచ్చింది తెలంగాణ ప్రభుత్వం.

Comment here