మహేష్ సినిమా లోగోను లాంచ్ చేసిన సితార ఆద్యాలు

మహేష్ బాబు, వంశీ పైడి పల్లి దర్శకత్వంలో 25వ సినిమా ను చేస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మహేష్ లుక్ ఆకట్టుకుంటున్నాయి. తాజగా ఈ సినిమాకు సంబంధించిన లోగోను మహేష్ బాబు ముద్దుల కూతురు సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి తనయ ఆద్య ల చేతుల మీదుగా లాంచ్ అయ్యింది. తన లోగో చిన్నారుల చేతుల మీదుగా లాంచ్ కావడమ పై మహేష్ సంతోషం వ్యక్తం చేశారు. నా రాబోయే చిత్రం లోగోను లాంచ్ చేసిన నా చిన్నారులకు ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. కాగా మహేష్ బాబు 25 వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయకగా నటిస్తున్నారు. దిల్ రాజు, అశ్విని దత్, పొట్లూరి వరప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘రాజసం’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here