తెలంగాణ జిల్లాల్లో ఆగస్ట్ 15నుంచి కంటి వెలుగు

ఆగస్టు 15వ తేదీ నుండి అన్ని జిల్లాల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ కంటి వెలుగు కార్యక్రామాలను ఆగస్టు 15వ తేదీ నుంచి జనవరి 26వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి ప్రతి మండలానికి ఒక టీంను నియమించామని, ప్రతి గ్రామంలో రోజుకు 250 మందికి ఒక టీం పరీక్షలు నిర్వహిస్తుందన్నారు. జిల్లాలకు ఇప్పటికే పరీక్షలకు కావలసిన పరికరాలు, కంటి అద్దాలు వచ్చాయన్నారు. అవసరమైన వారికి ప్రభుత్వమే ఉచితంగా సర్జరీలు చేయిస్తుందన్నారు. జిల్లాల్లో ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు నూతనంగా డాక్టర్లను నియమించినట్లు మంత్రి హరీష్ రావు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here