Local news

అమ్మవారికి బోనం సమర్పించిన సింధు

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఆదివారం సికింద్రాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయానికి వచ్చిన సింధుకు వేదపండితులు ఘన స్వాగతం పలికి, తీర్ధ ప్రసాదాలు అందజేశారు. తెలంగాణాలో నిర్వహించే బోనాల పండుగల్లో లాల్ దర్వాజ బోనాలు విశిష్టమైనవిగా చెబుతారు. వీటికి 104 సంవత్సరాల చరిత్ర ఉంది.

Comment here