ఆంధ్ర లో పొత్తు ప్రస్తావన తెచ్చిన అమిత్ షా?

ఆంధ్రప్రదేశ్ లో ప్రజల నాడి పట్టటంలో విఫలమైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆ వాస్తవాన్ని విస్మరించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడైన ఓ ఎంపీతో పొత్తు ప్రస్తావన తెచ్చారంట. ఆంద్రప్రదేశ్ లో మొత్తం 175 స్థానాలకు గాను వైసీపీ 100 సీట్లకు, జనసేన 60 సీట్లకు, బీజేపీ 15 సీట్లకు పోటీ చేసేలా అమిత్ షా ఓ ప్రతిపాదన తెచ్చారంట. అయితే అందుకు జగన్మోహన్ రెడ్డి ససేమిరా కుదరదన్నారట. దాని ఫలితమే తాజాగా ఛార్జిషీట్లో భారతి పేరు చేరడం అని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో ఎక్కువగా వినిపిస్తున్న మాట. జగన్మోహన్ రెడ్డి, ఒకవేళ అమిత్ షా ప్రతిపాదనకు ఒప్పుకుంటే బీజేపీతో కలిసినందుకు,ఇప్పటివరకూ తనకు గట్టి మద్దతుదారులుగా ఉన్న ముస్లిం, ఎస్సీ వర్గాలలో వ్యతిరేకత వచ్చి ఎక్కడ దూరమవుతారోనని జగన్మోహన్ రెడ్డి మదనపడుతున్నారట. అయితే ఇవేమీ పట్టించుకోని అమిత్ షా కేంద్రంలోని అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనమాటే చెల్లుబాటు కావాలని మొండిగా ఉన్నారంట. వాళ్లు మునిగేదే కాకుండా, వాళ్లని నమ్మినవాళ్ళని కూడా ముంచేలా బీజేపీ వేస్తున్న అడుగులు చూసి జగన్మోహన్ రెడ్డి భయపడిపోతున్నారట. ఈ పొలిటికల్ గేమ్ చివరకు ఎటు తిరిగి ఎటు వెళ్తుందో? వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here