కాలిఫోర్నియాలో తీవ్ర కార్చిచ్చు

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో చెలరేగిన కార్చిచ్చు శరవేగంగా వ్యాపిస్తూ పొగతో కమ్మేస్తుంది. “మెండోసినో కాంప్లెక్స్ ఫైర్” గా పిలుస్తున్న ఈ కార్చిచ్చు వల్ల పసిఫిక్ ప్రాంతం నుండి రాకీ పర్వతాల వరకూ దట్టమైన పొగ ఆవరించింది. గత వారం రోజులుగా షుమారు 187 వేల ఎకరాల అడవిని కాల్చేసిందని అమెరికా జాతీయ అగ్నిమాపక సంస్థ తెలిపింది.లేక్ ఎల్సీనోర్ నగరానికి సమీపంలో క్లివెలాండ్ జాతీయ అడవిలో మంటలు విపరీతంగా వ్యాపిస్తున్నాయి. గురువారానికి ఈ మంటలు దక్షిణ కాలిఫోర్నియాలోని నివాసాలకు చాలా సమీపంగా వచ్చేయడంతో హుటాహుటిన 20వేల మందిని అక్కడి నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొంతమంది యజమానులు మాత్రం అక్కడే ఉండి మంటల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమ ఇళ్లను కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది నిరంతరాయంగా మంటలను ఆర్పేందుకు కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సిబ్బంది హెలికాప్టర్ల సహాయంతోనూ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కాలిఫోర్నియా చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద కార్చిచ్చుగా భావిస్తున్నారు. ఈ కార్చిచ్చు వల్ల దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయి. సమీపంలోని ప్రాంతాలన్నీ దట్టమైన పొగలతో నిండిపోయాయి. చెట్లు, గడ్డి, పొదలు, మండుతుండడం వల్ల గాలి విపరీతంగా కాలుష్యమవుతుంది. కాలిఫోర్నియాను కమ్మేసిన కార్చిచ్చు కారణంగా రాష్ట్రంలో ఎయిర్ క్వాలిటీ అలెర్టును విధించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద స్థలం నుంచి వెలువడుతుతున్న పొగ వల్ల కంటి, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశముందని అమెరికా డీసీజ్ కంట్రోల్ సెంటర్ హెచ్చరించింది. ముఖ్యంగా హుద్రోగులు, చిన్న పిల్లలపై పొగ ప్రభావం ఎక్కువుగా ఉందని పేర్కొంది. ఈ ప్రమాదం కారణంగా రాష్ట్రము మరింత కాలుష్యంతో నిండిపోయిందని వాతావరణ నిపుణుడు స్టీవెన్ డిమార్టినో అన్నారు. ప్రస్తుతం అమెరికాలో వేసవికాలం నడుస్తుంది. ఈ కారణంగా అమెరికాలో ఉష్ణోగ్రతలు ఎక్కువుగా నమోడవుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అక్కడి అధికారులు ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here