పవన్ తో భేటి కానున్న మోత్కుపల్లి… త్వరలో జనసేన లోకి..?

తెలంగాణ టిడిపి బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు గురువారం నాడు మధ్యాహ్నం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో మోత్కుపల్లి నర్సింహులు సమావేశం కానున్నారు. మాజీ మంత్రి టిడిపి బహిష్కృత నేత మోత్కుపల్లి త్వరలో జనసేన కండువా కప్పుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై వ్యక్తిగత విమర్శలు చేసినందుకు నర్సింహులును పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. అప్పటి నుంచి మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబునాయుడుపై విమర్శల తీవ్రతను పెంచడమే కాదు.. ఏకంగా తిరుపతికి వెళ్లి చంద్రబాబునాయుడు ఓటమి పాలు కావాలని కూడ శ్రీవారిని మొక్కుకున్నారు. అయితే అప్పటి నుంచి ఆయన టీఆర్ఎస్‌లో చేరతారనే ప్రచారం ఉంది.. కానీ టీఆర్ఎస్‌లో ఆయన చేరలేదు. నర్సింహులు జనసేనలో చేరుతారనే ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తెలంగాణ జనసేన చీఫ్‌గా నరసింహులును నియమించే అవకాశాలు కూడ లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో కూడ జనసేనకు బలమైన నాయకుడు అవసరం ఉన్నారు. ఈ తరుణంలో మోత్కుపల్లి నరసింహులు లాంటి నాయకుడు జనసేనలో చేరితే పార్టీకి అదనపు ప్రయోజనం కలిగే అవకాశం ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మధ్యాహ్నం పవన్‌కళ్యాణ్‌తో సమావేశం తర్వాత ఈ విషయమై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here