ఇండిపెండెంట్ డే కానుకగా శాంసంగ్ టివి, ఫోన్ల పై భారీ ఆఫర్లు

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శాంసంగ్ మరో భారీ ఆఫర్లను ప్రకటించబోతున్నది. ఇండిపెండెంట్ డే కనుక గా ఫోన్ల పై వినియోగదారులకు స్పెషల్ ఆఫర్లను ప్రకటిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. అంతేకాదు.. శాంసంగ్‌ ఇండిపెండెన్స్‌ డే సేల్‌ కింద టీవీలు, అప్లియెన్స్‌, వేరబుల్స్‌, ఆడియో యాక్ససరీస్‌పై కూడా డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఆఫర్‌ చేస్తున్నట్టు తెలిపింది. ఆగస్టు 1 నుంచి మొదలైన ఈ సేల్‌ ఆగస్టు 5 వరకు కొనసాగుతుందని తెలిపింది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ విలువ రూ. 4 వేలు తగ్గించి రూ.64,990కు అందుబాటులో ఉంచింది. అంతేకాదు ఈ ఫోన్ కొన్నవారికి రూ.3000 ఇన్‌స్టాంట్ క్యాష్‌బ్యాక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులపై రూ.6000 క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది. శాంసంగ్‌ ఇండిపెండెన్స్‌ డే సేల్‌లో గెలాక్సీ ఎస్‌9 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.57,900 నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 128జీబీ, 256జీబీ వేరియంట్‌పై రూ.6000 ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌, 64జీబీ మోడల్‌పై రూ.5000 క్యాష్‌బ్యాక్‌ ఇస్తూ.. అదనంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులపై రూ.6000 క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనుంది. అయితే పేటీఎం నుంచి కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనున్నట్లు శాంసంగ్ తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here