National

శబరిమలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు

వయస్సుతో నిమిత్తం లేకుండా మహిళలంతా శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చంటూ ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు స్వీకరించి అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయాలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. విజయదశమి సందర్భంగా గురువారం ఆయన ప్రసంగిస్తూ… సమాజంలో శాంతిని నెలకొల్పే ఆలోచనలు, అంశాలతో సంబంధం లేకుండా తీసుకునే నిర్ణయాలు.. ఆచరణలో పెట్టేందుకు గానీ, మార్పులకు, పరిస్థితులకు తగినట్టుగా కొత్త సామాజిక క్రమాన్ని సృష్టించేందుకు గానీ అక్కరకు రావు అని పేర్కొన్నారు. శబరిమల ఆలయం విషయంలో ఇటీవల వెలువడిన తీర్పుపై ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి చూస్తే ఇదే విషయం స్పష్టమవుతుందన్నారు. శబరిమల రక్షణ కమిటీ గురువారం 12 గంటల రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో మోహన్ భగవత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా భారతీయుల ఆత్మగౌరవం దృష్ట్యా అయోధ్య రామాలయ నిర్మాణం తప్పనిసరి అని మోహన్ భగవత్ పునరుద్గాటించారు. దేశ సమైక్యతకు, సుహృద్భావ వాతావరణం నెలకొనేందుకు ఇది చాలా అవసరమని మోహన్ భగవత్ పేర్కొన్నారు.

Comment here