Education and Employment

నిరుద్యోగులకు శుభవార్త… 26వేల నుంచి 60 వేలకు పోస్టులు పెంపు

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నా నిరుద్యోగులకు రైల్వే శాఖా మంత్రి పియోష్ గోయెల్ శుభవార్త చెప్పారు. దీంతో రైల్వే పరీక్ష రాయబోతున్న అభ్యర్ధులు ఉరట చెందారు. అసిస్టెంట్, లోకో పైలెట్లు, టెక్నీషియన్స్ పోస్టులను 26, 502 నుంచి 60 వేలకు పెంచామని రైల్వే శాఖ మంత్రి ప్రకటించారు. ఈ పోస్టులకు ఇప్పటికే దాదాపు 47.56 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సబంధించిన కంప్యూటర్ పరీక్ష ఈ నెల 9 న జరగనున్నది. 26,502 లోకోపైలట్లు, టెక్నీషియన్ల పోస్టులకు రైల్వే గత ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కాగా ఆ పోస్టుల్లో మరిన్ని ఖాళీలు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో పోస్టులను పెంచామని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Comment here