ఆగష్టు 30లోగా మెడికల్ సీట్ల భర్తీ పూర్తి చేయాలి: చంద్రబాబు

మెడికల్ సీట్ల ఎంపికలో, రిజర్వేషన్ అభ్యర్థుల ఇబ్బందులపై శనివారం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రిజర్వేషన్ అభ్యర్థులకు మెరిట్ పై ఒపెన్లో సీటు లభిస్తే.., ఓపెన్ లేదా రిజర్వేషన్ కేటగరిల్లో దేనినైనా ఎంపిక చేసుకునే అవకాశం ఉండాలన్నారు. అయితే ఈ అవకాశాన్ని నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసిందన్నారు. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సీఎం చంద్రబాబు సూచించారు. రిజర్వేషన్ అభ్యర్థులకు అనుకూల నిర్ణయం వచ్చేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.ఆగస్ట్ 30 లోగా మెడికల్ సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని చంద్రబాబు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here