కొన్ని రోజులు ఏపీలోనే ఉండనున్న రేణు దేశాయ్

రేణు దేశాయ్… ఏదోక విషయం లో వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. ఇటీవల రెండో పెళ్ళికి నిశ్చితార్ధం చేసుకున్న రేణు దేశాయ్… మళ్ళీ టాలీవుడ్ లో అడుగు పెడతా అని చెబుతోంది. రేణు దేశాయ్ నటి, డైరెక్టర్, కథకురాలు, డిజైనర్ మల్టీ టాలెంటెడ్ పర్సన్… కాగా తాను మళ్ళీ తెలుగులో ఓ సినిమాను చేయనున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో తెలుగులో ఓ సినిమాను దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ రాయడం పూర్తయిందని త్వరలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తానని చెబుతుంది. అంతే కాదు ఈ సినిమాను ఆమె నిర్మిస్తుందట. దీనికి కొంత గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉందని అందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక గ్రామం లో కొన్ని రోజులు నివసించి – అక్కడ పేద రైతుల కష్ట నష్టాలను వాళ్ళు ఎదుర్కొనే సమస్యలను స్వయంగా పరిశీలించి అప్పుడు సినిమానును తెరకెక్కిస్తుందట.
రేణు దేశాయ్ ఇప్పటికే మరాఠీలో ఇష్క్ వాలా లవ్ తో రొమాంటిక్ కామెడి సినిమాలకు దర్శకత్వం వహించింది… అయితే తెలుగులో తొలిసారిగా దర్శకురాలుగా అడుగు పెడతా అంటోన్న రేణు దేశాయ్ సినిమా ఎలా ఉంటుంది అనే విషయం పై కొన్ని రోజులు ఆగాల్సిందే.. !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here