బాలీవుడ్ నటితో రవిశాస్త్రి ప్రేమాయణం?

బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్-టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి ప్రేమాయణంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా కథనాల ప్రకారం.., టీమిండియా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి- బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ జంట రహస్యంగా రెండేళ్ల నుంచి ప్రేమాయణంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం బయట తెలియకుండా వారిద్దరూ జాగ్రత్త పడుతున్నారట. ఓ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ,తమ కొత్త కార్ల లాంచింగ్ ఈవెంట్లకోసం 2015 నుంచి పలుమార్లు ఈ జంటను పిలిచిందట. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలోనే వీరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రవిశాస్త్రి వయస్సు 56 సంవత్సరాలు. కాగా నిమ్రత్ కౌర్ కు 36 సంవత్సరాలు. ఇద్దరికీ 20 ఏళ్ల తేడా ఉంది. గత దశాబ్ద కాలంగా రవిశాస్త్రి తన భార్య రీతూకు దూరంగా ఉంటున్నాడు. అయితే తమ రిలేషన్ పై ఇద్దరూ ఇప్పటివరకూ స్పందించకపోవడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here