Local news

తాము చెప్పేది తప్పయితే ముక్కు నేలకు రాస్తా : రేవంత్ రెడ్డి

తెరాస నేతలు ప్రాజెక్టులు, నీళ్లను అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారని కాంగ్రెస్ నేత, ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం పెడితే కేసీఆర్, హరీష్ రావు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవాచేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు కాంగ్రెస్ హయాంలోనే 11 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా రేవంత్ చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రాజెక్టు డిజైన్ ను తమ ఇష్టానుసారంగా మార్చారన్నారు. నీరు పారే ఆయకట్టు పెరగకుండానే ప్రాజెక్ట్ నిర్మాణం వ్యయం మాత్రం పెంచేసారని అన్నారు.జేఏసీ ఇచ్చిన సలహాలు తీసుకోకుండా.,మంత్రి హరీష్ రావు ఎదురు దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులపై చర్చకు తాము సిద్ధమని, మీకు దైర్యంఉంటే చర్చకు రావాలని, ఒకవేళ తాము చెప్పినది తప్పయితే ముక్కు నేలకు రాస్తామని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు..

Comment here