ఆ హీరోయిన్ కు సినిమా అవకాశాలు.. ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్

కన్నడ స్టార్ హీరోయిన్ రష్మిక కన్నడ హీరో రక్షిత్ ను పెళ్లాడనున్నది. ఈ జంటకు ఎంగేజ్ మెంట్ అయిన సంగతి తెలిసిందే.. ఐతే పెళ్లి కి ముందు నుంచి రష్మిక బిజీ అయిపోయింది. ఇక తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. త్వరలో రిలీజ్ కాబోతున్న గీత గోవిందం లో కూడా నటిస్తుంది. కాగా తాజాగా రష్మిక, రక్షిత్ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయింది అనే ప్రచారం జరుగుతుంది. తనకు వస్తున్న సినిమా ఆఫర్ల దృష్ట్యా ఇప్పట్లో పెళ్ళిళ్ళు చేసుకొనే ఆలోచన లేనట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రష్మిక తో రక్షిత్ ఫోన్ లో మాట్లాడడానికి ప్రయత్నించినా ఆమె స్పందించడం లేదని ఫిల్మ్ నగర్ టాక్.. దీంతో వీరిద్దరూ తమ ప్రేమకు బ్రేకప్ చెప్పేసుకున్నారు అని అంటున్నారు.. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే ఎవరో ఒకరు మాట్లాడాల్సిందే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here