వంశీ పైడిపల్లి పుట్టిన రోజు వేడుకల్లో చరణ్, మహేష్, ఎన్టీఆర్ లు సందడి

గత కొంత కాలంగా యాంగ్ హీరోల మధ్య మంచి రిలేషన్స్ ఏర్పడ్డాయి… ఇక ముఖ్యంగా రామ్ చరణ్, మహేష్ బాబు. జూ. ఎన్టీఆర్ ల మధ్య మంచి మైత్రి ఏర్పడింది.. ఇటీవల ఈ ముగ్గురు సమయం సందర్భం కలిసి వస్తే.. ఒకే వేదిక మీదకు వస్తున్నారు.. తాజాగా దర్శకుడు వంశీ పైడిపల్లి పుట్టిన రోజు సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యాంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రిన్స్ మహేష్ బాబులు సందడి చేశారు. తాజాగా మహేష్ బాబు 25వ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ కు బృందావనం, రామ్ చరణ్ కు ఎవడు వంటి సూపర్ హిట్ సినిమాలను ఇచ్చిన సంగతి తెలిసిందే.. కాగా రామ్ చరణ్ ఎన్టీఆర్ లు రాజమౌళి దర్శకత్వంలో నటించబోయే సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here