రాజ్యసభ డిప్యూటి చైర్మన్ గా ఎన్డియే అభ్యర్ధి హరివంశ్ గెలుపు

రాజ్యసభ డిప్యూటి చైర్మన్ ఎన్నికల్లో బిజేపీ అభ్యర్ధి హరివంశ్ గెలిచారు. పార్లమెంట్ ఉభయ సభలు కొనసాగుతున్నాయి. మోషన్ల ద్వారా డిప్యూటీ చైర్మన్‌ను ఎన్నుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అధికార పక్షం నుంచి 5, విపక్షాల తరపున నుంచి 4 మోషన్లు దాఖలు చేశారు. ఈ పోటీలో డిప్యూటి చైర్మన్ ఎన్డియే అభ్యర్ధిగా హరివంశ్ (జేడియూ), విపక్షాల అభ్యర్ధిగా బైక్ హరిప్రసాద్ (కాంగ్రెస్) బరిలో నిలిచారు. కాగా కాంగెస్ అభ్యర్ధికి 105 ఓట్లు రాగా… బిజేపీ అభ్యర్ధికి 125 ఓట్లు వచ్చాయి. దీంతో రాజ్యసభ డిప్యూటి చైర్మన్ గా ఎన్డియే కూటమి కి చెందిన హరివంశ్ ఎన్నికయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here