రాజమౌళి తనయుడు కార్తికేయ నిశ్చితార్థం

ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి తనయుడు కార్తికేయ నిశ్చితార్థం ప్రముఖుల మధ్య ఘనంగా జరిగింది. భక్తి గీతాలు ఆలపించే గాయని పూజా ప్రసాద్ తో కార్తికేయ ప్రేమలో ఉండగా… వీరి పెళ్లికి ఇరువైపు పెద్దలు అంగీకరించడంతో రాజమౌళి ఇంట్లో నిశ్చితార్థం జరిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇక వీరి వివాహం ఈ సంవత్సరం చివరలో జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా పూజా ప్రసాద్ ఎవరోకాదు… ప్రముఖ నిర్మాత విబి రాజేంద్రప్రసాద్ పెద్ద కుమారుడు రాంప్రసాద్ కుమార్తె. ప్రముఖ హీరో కం విలన్ జగపతిబాబు కు రాంప్రసాద్ సోదరుడే. కార్తికేయ రాజమౌళి దగ్గర అసిస్టెంట్ గా చేయడంతో పాటు పలు చిత్రాలకు లైన్ ప్రొడ్యూసర్ గా పని చేశారు. ప్రస్తుతం వివిధ రంగాల్లో తన ప్రతిభను కనబరుస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here