రైల్వేజోన్ ఇవ్వడం సాధ్యం కాదు : కేంద్రం అఫిడవిట్

విశాఖకు రైల్వేజోన్ ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఈ విషయాన్ని మార్చి 12న జరిగిన రైల్వే శాఖ అధికారుల సమీక్షా సమావేశంలోనే చెప్పారని స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన చట్టంపై ఈ రోజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్లో కేంద్ర హోంశాఖ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. విభజన చట్టంలోని పదో షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల ఆస్తులను పంచాల్సిన అవసరం లేదంది. పదో షెడ్యూల్లోని ఉన్నత విద్యామండలి కేసు సందర్భంలో సంస్థల విభజనతో పాటు ఆస్తులు కూడా జనాభా ప్రాతిపదికన పంచాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. నూతన మెట్రో విధానానికి అనుగుణంగా ఉంటేనే విజయవాడలో మెట్రోకు హోంశాఖ ఆమోదం తెలుపుతామని స్పష్టంచేసింది.ఇప్పటివరకూ 15వేల కోట్ల ఖర్చులకు
మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం యూసీలు సమర్పించిందని పేర్కొంది. వివిధ శాఖలకు సంభందించిన 753 మంది ఉద్యోగుల విభజన పెండింగ్ లొనే ఉందని, అనేక సంస్థల ఏర్పాటు ఇంకా డీపీఆర్, ఆమోదం దశలోనే ఉన్నాయని వెల్లడించింది. పలు వివాదాస్పద అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదంది. ఏకాభిప్రాయం లేకపోవడం వల్లే పలు అంశాల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని అఫిడవిట్లో తెలిపింది……KS
85

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here