Local news

రాహుల్ పర్యటన వల్ల తెలంగాణ కు ఒరిగేదేమీ లేదు : ఎంపీ బాల్క సుమన్

రాహుల్ పర్యటనను తాము అడ్డుకోవడంలేదని, ఆ అవసరం మాకు లేదని తెలంగాణ ఎంపీ బాల్క సుమన్ అన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనను తాము అడ్డుకోవాలని చూస్తున్నామని, కాంగ్రెస్ ఆరోపించడంలో అర్ధం లేదని, ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ సభకు అనుమతినివ్వకపోడం, యూనివర్సిటీ వీసీ తీసుకున్న నిర్ణయమని ఎంపీ బాల్క సుమన్ చెప్పారు. రాహుల్ పర్యటన వల్ల తెలంగాణకు ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు. రాహుల్ పర్యటనను తాము అడ్డుకోవడం లేదని బాల్కసుమన్ అన్నారు. కాంగ్రెస్ నేతల విమర్శలు అర్ధరహితమన్నారు.

Comment here