మళ్ళీ కన్ను కొట్టిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ లోకసభలో ప్రధాని నరేంద్ర మోదీని కౌగిలించుకుని, ఆతర్వాత కన్నుకొట్టడం అప్పట్లో సంచలనం సృష్టించింది. దీనిపై నెటిజన్లు ఎవరికి తోచిన విధంగా వారు స్పందించారు. కొందరైతే రాహుల్, ప్రియా వారియర్ లలో ఎవరు కన్ను బాగా కొట్టారని చర్చ కూడా నడిచింది. అయితే దీనిని మరిచిపోతున్న తరుణంలో రాహుల్ మళ్లీ కన్ను కొట్టారు. రాజస్థాన్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేయడానికి రాహుల్ గాంధీ రాజస్థాన్ వెళ్లారు. జైపూర్ లో జరిగిన ఓ సభలో రాహుల్ గాంధీ రాజస్థాన్ కాంగ్రెస్ అద్యక్షుడు సచిన్ పైలెట్ కు కన్ను కొట్టి మళ్లీ చర్చకు దారితీశారు. రాహుల్ గాంధీ కన్నుకొట్టిన మరుక్షణమే సచిన్ పైలెట్, వేదిక మీదనున్న రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ను ఆలింగనం చేసుకోవడం గమనార్హం. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం లాగా ఈ సీన్ కనిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here