Cinema

శ్రీ రెడ్డి నీ పై జాలేస్తుంది : లారెన్స్

గత కొంత కాలంగా శ్రీ రెడ్డి అవకాశాల పేరుతో సినీ ప్రముఖులు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు… అని సంచలన కామెంట్స్ చేస్తూ.. హల్ చల్ చేస్తోంది. టాలీవుడ్ లో ప్రముఖల పేర్ల ను వెల్లడిస్తూ.. సోషల్ మీడియా లో కామెంట్స్ చేసినా టాలీవుడ్ లైట్ తీసుకుంది.. దీంతో టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వైపు అడుగు పెట్టి.. దర్శకుడు మురుగుదాస్, లారెన్స్, శ్రీకాంత్, సి. సుందరం వంటి వారి పై సంచలన కామెంట్స్ చేసింది. తన పోరాటాన్ని చెన్నైకు షిప్ట్ చేసింది… సినిమా అవకాశాల కోసం ఆమె దర్శకులు, నటులతో గడిపినట్టు స్వయంగా అంగీకరిస్తూ… లారెన్స్ తనను హోటల్‌కి రమ్మన్నాడని, అక్కడ లారెన్స్… రాఘవేంద్ర స్వామి ఫోటో పెట్టుకుని కూడా తనతో తప్పుగా ప్రవర్తించాడు అని సంచలన కామెంట్స్ చేసింది. దీంతో లారెన్స్ వెంటనే స్పందిస్తూ.. నేను శ్రీ రెడ్డికి డైరెక్ట్‌గా చెబుతున్నా.. నేనే తప్పూ చేయలేదు ఆ విషయం నాకు తెలుసు.. ఆ భగవంతుడికి తెలుసు. నువ్వింత చేశాక కూడా నాకు నీపై కోపం రావట్లేదు. నీ ఇంటర్వ్యూస్‌ అన్నీ చూశాను.. నీపై జాలి కలుగుతోంది. నిజంగా నీ ప్రాబ్లమ్ ఏంటి? నీకు ఛాన్స్ ఇప్పిస్తామని ప్రతి ఒక్కరూ నిన్ను మోసం చేశారనే కదా. నువ్వొక మంచి నటివని చెప్తున్నావు కదా.. మేమొక ప్రెస్‌మీట్ ఏర్పాటు చేస్తాం.. దానిలో నువ్వు కూడా వచ్చి జాయిన్ అవ్వు. మీడియా ముందు నీకో క్యారెక్టర్, సీన్ ఇస్తా నటించి చూపించు అలాగే కొన్ని డ్యాన్స్ స్టెప్స్ చూపిస్తా అవి చేసి చూపించు.. అంటే దానర్థం నేనేదో కష్టమైన స్టెప్స్ ఇస్తాను అని కాదు. నేను చాలా సింపుల్ స్టెప్స్, డైలాగ్స్ ఇస్తా.. అవి కూడా నటులకు ఉండాల్సిన బేసిక్ క్వాలిటీకి సంబంధించినవి మాత్రమే. నువ్వు నిజంగా టాలెంటెడ్ అయితే నా ఎదుట, ప్రెస్ ఎదుట అవి చేసి చూపించు. నిజంగా నువ్వు బెస్ట్ యాక్టర్‌వి అని నేను ఫీల్ అయితే ఓ డైరెక్టర్‌గా ప్రెస్ ఎదుట నా నెక్ట్స్ మూవీలో నీకో మంచి క్యారెక్టర్ ఇచ్చేందుకు సైన్ చేసి.. అడ్వాన్స్ ఇస్తాను.. అని సోషల్ మీడియా ద్వారా ఛాలెంజ్ చేశాడు.

లారెన్స్ పై శ్రీ రెడ్డి ప్రకటన…. లారెన్స్ దానికి స్పందించడం చూసి ఒక్కొక్కరు ఒకలా మాట్లాడుతున్నారు. అయితే లారెన్స్ చేసిన ఓపెన్ చాలెంజ్ కు శ్రీ రెడ్డి స్పందించింది. … రాఘవ మాస్టర్ గారు.. ఇదిగో ఈ వీడియో నా టాలెంట్‌కి శాంపిల్ మాత్రమే. చూడు.. కేవలం నీ కోసమే చేశా… అంటూ ఓ వీడియో లింక్ పోస్ట్ చేసింది .. కానీ ఆ వీడియో లింక్ ఓపెన్ కావడం లేదు… ఇక తర్వాత వెంటవెంటనే తన పెర్ఫార్మెన్స్ ను ప్రదర్శిస్తూ.. ఒక నాలుగు వీడియోలు ఫర్ లారెన్స్ మాస్టర్ అని పోస్ట్ చేసింది.
అయితే ఇప్పటికే ప్రముఖ నిర్మాత కుట్టి పద్మిని కూడా శ్రీ రెడ్డి కి కండిషన్ అప్లై అంటూ…. తన వెబ్ సిరీస్ లో నటించే అవకాశం ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.. దీంతో తాజాగా సగటు ప్రేక్షకుడికి ఒక సందేహం ఏర్పడింది. క్యాస్టింగ్ కౌచ్ అంటూ శ్రీ రెడ్డి చేస్తోన్న పోరాటం దేనికోసం.. సిని పరిశ్రమలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ ని తరిమి కొట్టడం కోసం చేస్తోందా…? లేక తనకు అవకాశాలు కోసం.. డబ్బు కోసం.. నిత్యం వార్తల్లో నిలవడం కోసం చేస్తోందా..? అని ఆలోచిస్తున్నాడు.

Comment here