రాఫెల్ డీల్ పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రశాంత్ భూషణ్, అరుణ్ శఔరీ, యశ్వంత్ సిన్హా

రాఫెల్ ఒప్పందంపై సీబీఐతో దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మాజీ కేంద్రమంత్రులు అరుణ్ శఔరీ, యస్వంత్ సిన్హా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2018 అక్టోబర్ 4న తాము చేసిన లిఖితపూర్వకంగా చేసిన ఫిర్యాదుపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై తమకు ఆవేదన కలిగించిందని ఆ పిటీషన్లో వారు పేర్కొన్నారు. తాము చేసిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించాలని, ఫిర్యాదులో తాము పేర్కొన్న నేరాలకు సంబంధించిన విచారణను నిర్దిష్ట కాలపరిమితిలోగా జరిపి, ఎప్పటికప్పుడు స్థాయీ నివేదిక వచ్చేలా చూడాలని, విచారణ అప్పగించిన సీబీఐ అధికారుల బదిలీ జరపకుండా కేంద్రాన్ని ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించిన పిటీషన్లో ప్రశాంత్ భూషణ్, అరుణ్ శఔరీ, యశ్వంత్ సిన్హా కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here