Sports

సింధును అభినందించిన చంద్రబాబు

బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో రజతం గెలుచుకున్న పీవీ.సింధును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ఫైనల్లో కరోలినా మారిన్ చేతిలో ఓడినా అద్భుతమైన ప్రతిభను చూపిందని చంద్రబాబు ప్రశంసించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో రజతం గెలిచి, భారత షట్లర్ల ఘనతను చాటిందని కొనియాడారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో ఇప్పటివరకు నాలుగు పతకాలు సాధించి సింధు సువర్ణాధ్యాయం సృష్టించిందని అన్నారు. వరుసగా రెండుసార్లు మన తెలుగమ్మాయి పీవీ.సింధు ఫైనల్ కు చేరుకుని చరిత్రకు శ్రీకారం చుట్టిందని ప్రశంసలు కురిపించారు.

Comment here