Local news

పుట్టపర్తిలో “మానవ విలువలు-న్యాయప్రపంచం” సదస్సు

పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో శనివారం “మానవ విలువలు-న్యాయప్రపంచం” అంశంపై సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ప్రారంభోపన్యాసం చేశారు. రెండు రోజులపాటు జరిగే సదస్సుకు దేశ, విదేశాల నుండి పుట్టపర్తికి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు తరలివచ్చారు. ఈ రోజు సదస్సులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ న్యాయ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి, అనంతపురం జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Comment here