తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జయశంకర్ జయంతి వేడుకలు

తెలంగాణా సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ జయశంకర్ కు నివాళులర్పించారు. తెలంగాణ కోసం తపించిన ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలను కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం జయశంకర్ చేసిన త్యాగాలను ఆయన కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ పేరు చరిత్రపుటల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. జయశంకర్ కు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ,నాయని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, ఎంపీ కవిత, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, జయశంకర్ అభిమానులు నివాళులర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here