ప్రొ కబడ్డీలో తొలిరోజు బోణీ కొట్టిన తమిళ్ తలైవాస్, టై చేసుకున్న పుణేరి పల్టాన్, యుముంబ

ప్రొ కబడ్డీ సీజన్ 6 ఆదివారం చెన్నైలో ఆరంభమైంది. తొలి మ్యాచ్లో తమిళ్ తలైవాస్ వర్సెస్ పాట్నా పేరైటీస్ మధ్య జరిగింది. తమిళ్ తలైవాస్ అద్భుతంగా ఆడి మొదటి నుంచి లీడింగ్లో కొనసాగింది. ఫస్ట్ హాఫ్ లో 26-8 తో లీడింగ్ సాధించింది. సెకండాఫ్ లో కూడా ఆ లీడ్ ను కంటిన్యూ చేసి 42-26 తో మ్యాచ్ ముగిసింది. తమిళ్ తలైవాస్ 16 పాయింట్ల తేడాతో విజయం సాధించి 5 పాయింట్లు తన ఖాతాలో వేసుకుంది. తమిళ్ తలైవాస్ రైడర్ అజయ్ ఠాకూర్ 14పాయింట్లు సాధించాడు. డిఫెండర్ అమిత్ హుడా 4 పాయింట్లు సాధించాడు. అనంతరం జరిగిన రెండో మ్యాచ్లో పునేరి పల్టాన్ వర్సెస్ యు ముంబ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ హోరాహోరీగా జరిగి టై గా ముగిసింది. చెరో 3 పాయింట్లు తమ ఖాతాలో వేసుకున్నాయి. ఆట ఆరంభం నుంచి హోరాహోరీగా సాగింది. ఫస్ట్ హాఫ్ లో పుణేరి పల్టాన్ 18, యుముంబ 20 పాయింట్లతో ఉన్నాయి. సెకండాఫ్ కూడా హోరాహోరీగా సాగి 32-32 తో మ్యాచ్ టై గా ముగిసింది. పుణేరి పల్టాన్ ఆటగాళ్లు నితిన్ తోమర్ రైడింగ్లో 15 పాయింట్లు, గిరీష్ మారుతి ఎర్నాక్ డిఫెండింగ్లో 4 పాయింట్లు సాధించారు. అలాగే యుముంబ ఆటగాళ్లు సిద్దార్థ్ దేశాయ్ రైడింగ్లో 14 పాయింట్లు, ఫజల్ అట్రాచలి డిఫెండింగ్లో 4 పాయింట్లు సాధించారు. సోమవారం మొదటి మ్యాచ్లో పుణేరి పల్టాన్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ మధ్య జరుగుతుంది. రెండో మ్యాచ్ తమిళ్ తలైవాస్ వర్సెస్ యూపీ యోధ మధ్య జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here