ప్రొ కబడ్డిలో తొలి మ్యాచ్లో పునేరి పల్టాన్ విజయం, రెండో మ్యాచ్లో యూపీ యోధా విజయం

ప్రొ కబడ్డీలో సోమవారం జరిగిన తొలి మ్యాచ్లో పుణేరి పల్టాన్, హర్యానా స్టీలర్స్ పై (34-22) 12 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. అది నుంచి పుణేరి పల్టాన్ ఆధిక్యత ప్రదర్శించింది. ఫస్ట్ హాఫ్ లో పుణేరి పల్టాన్ 15-9 తో ముందంజ వేసింది. సెకండ్ హాఫ్ లో కూడా ఆధిక్యత నిలబెట్టుకుంటూ విజయం సాధించింది. పుణేరి పల్టాన్ లో రైడర్ నితిన్ తోమర్ 7 పాయింట్లు, మోర్ 6 పాయింట్లు, దీపక్ కుమార్ దహియా 5 పాయింట్లు సాధించారు. డిఫెండింగ్లో రవి కుమార్ 3, గిరీష్ మారుతి ఎర్నాక్ 2, సందీప్ నర్వాల్ 2 పాయింట్లు సాధించారు. కాగా హర్యానా స్టీలర్స్ లో రైడర్లు వికాస్ కండోలా 8 పాయింట్లు, డిఫెండర్ సురేంద్ర నాడా 4 పాయింట్లు సాధించారు.
ఇక రెండో మ్యాచ్లో యూపీ యోధా, తమిళ్ తలైవాస్ పై (37-32) 5 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఆట ఆరంభం నుంచి యూపీ యోధా దూకుడుగా ఆడింది. తమిళ్ తలైవాస్ కు ఎక్కడా చాన్సు ఇవ్వలేదు. ఫస్ట్ హాఫ్ లో 18-4 తో ఆధిక్యత సాధించింది. సెకండాఫ్ లో సొంత అభిమానుల మధ్య తమిళ్ తలైవాస్ అనూహ్యంగా పుంజుకుంది. యూపీ యోధా టీమ్ లో రైడర్ ప్రశాంత్ కుమార్ రాయ్ 8 పాయింట్లు, శ్రీకాంత్ 5 పాయింట్లు, రిశాంక్ దేవాడిగా 4 పాయింట్లు, డిఫెండర్ నరేందర్ 4 పాయింట్లు సాధించారు. అలాగే తమిళ్ తలైవాస్ లో రైడర్ అజయ్ ఠాకూర్ 12 పాయింట్లు, డిఫెండర్ మంజీత్ చిల్లర్ 4 పాయింట్లు సాధించారు.
మంగళవారం తొలి మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీ వర్సెస్ గుజరాత్ ఫార్చ్యూన్ గైయింట్స్, రెండవ మ్యాచ్లో తమిళ్ తలైవాస్ వర్సెస్ తెలుగు టైటాన్స్ తలపడతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here