ప్రధాని నరేంద్రమోదీపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు

భారత, పాకిస్థాన్ శాంతి చర్చల కోసం తాను ఇచ్చిన ఆహ్వానాన్ని భారత్ తిరస్కరించడంపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర స్థాయిలో అక్కసు వెళ్లగక్కారు. తక్కువ స్థాయి వ్యక్తులు ఉన్నత పదవుల్లో ఉన్నారంటూ, ప్రధాని నరేంద్రమోదీనుద్దేశించి పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దురహంకారంతోనే భారత్ ఈ నిర్ణయం తీసుకుందంటూ చిందులు తొక్కారు. భారత్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని భారత్ రద్దు చేయడంపై శనివారం ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్లో స్పందిస్తూ.. శాంతి చర్చలు పునరిద్దరించాలంటూ నేను ఇచ్చిన పిలుపై భారత్ దురహంకారపూరిత, ప్రతికూల స్పందనపై తీవ్ర నిరాశకు గురయ్యాను. ఉన్నత పదవులు చేపట్టిన తక్కువ స్థాయి వ్యక్తులను నేను చాలా మందిని చూశాను. విశాల ప్రపంచాన్ని చూడగల దార్శినికత వారికి ఉండదు.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here