ఆగస్ట్ ఐదు చెన్నై రానున్న రాష్ట్రపతి కోవింద్

డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అయిన కరుణానిధిని పరామర్శించేందుకు రాష్ట్రపతి రామనాధ్ కొవింద్ ఈనెల 5న చెన్నై రానున్నారు. రాష్ట్రపతి స్వయంగా కరుణానిధిని కలసి ఆరోగ్యపరిస్థితి అడిగి తెలుసుకుంటారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కరుణానిధికి బ్లడ్ ప్రెషర్ ఒక్కసారిగా పడిపోవడంతో, కుటుంబసభ్యులు జులై 27వ తేదీన కావేరీ హాస్పిటల్ లో చేర్పించారు. ప్రస్తుతం కరుణానిధి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, కోలుకుంటున్నారని ఆయన కుటుంబసభ్యులు, కావేరీ హాస్పిటల్ డాక్టర్లు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here