Local news

ప్రత్యేక వేలం కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పి.పుల్లారావు

గుంటూరు ఎన్టీఆర్ వ్యవసాయ మార్కెట్ యార్డు నందు రైతు ఉత్పత్తి సంఘం (ఎఫ్.పీ.వో) కోసం ప్రత్యేక వేలం కేంద్రాన్ని శనివారం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు దళారుల నుండి నష్టపోకుండా ఎఫ్.పీ.వో ల విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయన్నారు. దేశీయ, అంతర్జాతీయ విదేశాల నుంచి ఎక్స్ పోర్టుర్లు నేరుగా కొనుగోలు చేయడం వల్ల రైతులకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది.ఎఫ్.పీ.వో లు రసాయనాలు,ఎరువులు వినియోగించకుండా సేంద్రీయ పద్ధతుల్లో పంటని పండిస్తారని తెలిపారు. అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాలో కూడా ఎఫ్.పీ.వో ల కేంద్రాలను సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఎఫ్.పీ.వో లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తే రైతులు మంచి ఫలితాలను పొందుతారన్నారు. ఒక్కో గ్రామంలో వంద నుంచి వేయి మందివరకూ ఎఫ్.పీ.వో గా ఏర్పడే అవకాశముంది.ఎఫ్.పీ.వో ల ఉత్పత్తులను ప్రోత్సాహంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీలు సర్టిఫికెట్లను ఇస్తారన్నారు. రైతులను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు……. KS

Comment here